- అన్ని క్రీడల్లో పాగా వేయాలని కేసీఆర్ ప్రయత్నం: వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)ను కల్వకుంట్ల ఫ్యామిలీకి అనుకూలంగా మార్చుకునే కుట్రలు జరుగుతున్నాయన్నారు బీజేపీ నేత , మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. మంగళవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు.
అజారుద్దీన్ కు ఓటేయాలని HCA సభ్యులకు ఫోన్ చేసి మరీ KTR అడుగుతున్నారని చెప్పారు. తాను నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రయత్నించారన్నారు.
అన్ని క్రీడా సంఘాల్లో కల్వకుంట్ల ఫ్యామిలీనే ఉండాలని కేసీఆర్ కోరుకుంటున్నారన్నారు. గతంలో BCCI నిధులు లేకపోయినా తాము HCAను నడిపించామని వివేక్ గుర్తు చేశారు. తమ ప్యానెల్ ను గెలిపించాలని సభ్యులను ఆయన కోరారు.
