
కర్నాటక ఎన్నికల టైమ్ దగ్గరపడుతోంది. JDS కుమారస్వామిని మరోసారి ముఖ్యమంత్రి చేస్తానన్న సీఎం కేసీఆర్ మాత్రం పత్తా లేరు. ఇప్పటివరకు కర్నాటక ఎన్నికలపై పల్లెత్తు మాట మాట్లడలేదు కేసీఆర్. BRS లీడర్లు కూడా కర్నాటక జోలికి పోలేదు. సీఎం కేసీఆర్ కు, కుమారస్వామికి గ్యాప్ పెరిగిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలకు బలం చేకూరే విధంగా సీఎం కేసీఆర్..మహారాష్ట్రలో వరుస టూర్లు పెట్టుకున్నారు. మొత్తం ఎపిసోడ్ చూస్తే..నిజంగానే కుమారస్వామికి, కేసీఆర్ కు చెడిందనే అందరూ అనుకుంటున్నారు.
సీన్ కట్ చేస్తే..కర్నాటక ఎన్నికల్లో తన తరపున జేడీఎస్ కు ఏం చేయాలో అన్నీ చేసి పెడుతున్నారట ముఖ్యమంత్రి కేసీఆర్. పొలిటికల్ ఆన్ స్క్రీన్ పై కనిపించకపోయినా..తెరవెనక పనుల్లో బిజీగా ఉన్నారని టాక్. జేడీఎస్ కు ఆర్థిక సాయంతో పాటు తనదైన సాయం అందిస్తున్నట్టు సమాచారం. JDS పూర్తి బాధ్యత కేసీఆరే తీసుకున్నట్టుగా చర్చ నడుస్తోంది. దీనిపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ లీడర్లు నోరుమెదపడం లేదు. కర్నాటక వ్యవహారం మనకెందుకులేనని లైట్ తీసుకుంటున్నారు.
ప్లాన్ లో భాగంగానే కుమారస్వామికి, KCR కు చెడిందనే ప్రచారం జరిగినట్లుగా చెప్తున్నారు. మహారాష్ట్రలో BRS పార్టీని బలోపేతం చేస్తున్నట్టుగా బిల్డప్ కూడా కేసీఆర్ వ్యూహామేనని అనుకుంటున్నారు. కర్నాటకలో జేడీఎస్ కోసం సారూ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాడట. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే జేడీఎస్ కీలక పాత్ర పోషించేలా పావులు కడుపుతున్నారట. కాంగ్రెస్-, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంపై ముందస్తుగానే కసరత్తు మొదలుపెట్టినట్టు టాక్. క్యాంప్ రాజకీయాలకు కూడా ప్రిపేర్ అయినట్టుగానే తెలుస్తోంది. తెలంగాణలో షెల్టర్ ఇచ్చేలా ముందుకెళ్తున్నట్టు సమాచారం. ఈ స్ట్రాటజీ మొత్తం కేసీఆరే డిజైన్ చేస్తున్నారని చెప్తున్నారు.
కేసీఆర్ ఇంటా బయట ఎక్కడా మాట్లడకపోయినా...దేవేగౌడ, కుమారస్వామి మాత్రం కేసీఆర్ ను తమ ఇంటి మనిషిగా చెప్పుకుంటున్నారు. బీపోర్ ఎలక్షన్స్..ఆఫ్టర్ ఎలక్షన్స్ జేడీఎస్ కు కర్త కర్మ క్రియ ముఖ్యమంత్రి కేసీఆరేనని ఇంటర్నర్ గా జరుగుతోన్న చర్చ.