మద్యం ఏరులై పారుతున్నా..  పట్టించుకోరా ?

మద్యం ఏరులై పారుతున్నా..  పట్టించుకోరా ?

 

  • ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి
  • ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇందిరా శోభన్

హైదరాబాద్​: కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్టం లో మద్యం ఏరులై పారుతోందని, లిక్కర్​ మీద ఉన్న సోయి కేసీఆర్ కు ప్రజలపై లేదంటూ మండిపడ్డారు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇందిరా శోభన్. ప్రభుత్వానికి మద్యం పాలసీపై ఉన్న శ్రద్ధ మిగతా పాలసీలపై లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైన్స్, బెల్ట్​ షాపులే కనిపిస్తున్నాయని, అభివృద్ధి అంటే ఇదేనా అని ప్రశ్నించారు. లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం కన్నా నష్టమే ఎక్కువగా ఉందన్నారు. జనాలను తాగుడుకు బానిసలను చేస్తే.. తననెవరు ప్రశ్నించలేరు అని సీఎం కుట్రపూరితంగా మద్యాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. తన సొంత ఇలకాలో ఓ అమ్మాయిపై అఘాయిత్యం జరిగితే ఇంతవరకు మంత్రి కేటీఆర్​ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. విద్య, వైద్యం మీద దృష్టి పెడితే రాష్టం అభివృద్ధి చెందుతుందన్నారు. మద్యాన్ని నిషేదించాలని, గంజాయి, డ్రగ్స్ ని నియంత్రించాలని డిమాండ్​ చేశారు. విద్య, వైద్యం మీద దృష్టి పెడితే రాష్టం అభివృద్ధి చెందుతుందన్నారు. 

మరిన్ని వార్తల కోసం: 

ప్రముఖ నటుడి సెకండ్ మ్యారేజ్

పవన్ మూవీ షూట్ కంప్లీట్