ప్రజల్ని కాపాడుతారా.. కాంట్రాక్టర్ల జేబులు నింపుతారా: జగ్గారెడ్డి

ప్రజల్ని కాపాడుతారా.. కాంట్రాక్టర్ల జేబులు నింపుతారా: జగ్గారెడ్డి

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నియంత్రించడంలో తెలంగాణ ప్రభుత్వం  ఘోరంగా విఫలమైందని ఆరోపించారు  కాంగ్రెస్‌  ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఇప్పుడు  కావాల్సింది కాళేశ్వరం, కొండపోచమ్మ ప్రాజెక్టలు కాదని.. కరోనా బాధితులను రక్షించడమే సీఎం కేసీఆర్ బాధ్యత అన్నారు. ఉన్న నిధులన్నీ ప్రాజెక్టలకు మళ్లించారని.. ఆరోగ్యశ్రీ లో రూపాయి లేదన్నారు. ప్రజల్ని కాపాడుతారా.. కాంట్రాక్టర్ల జేబులు నింపుతారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

మంత్రి ఈటల రాజేందర్ ఆరోగ్య మంత్రిగా లేరనీ… ఆయన కేవలం బంట్రోత్‌ ఉద్యోగం చేస్తున్నారన్నారు జగ్గారెడ్డి. చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం తప్ప.. ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమించడం లేదని విమర్శించారు. గాంధీ ఆస్పత్రిలో డాక్టర్లకు సరైన సదుపాయాలు లేవన్నారు. కేవలం బులెటిన్లు విడుదల చేయడానికే ఈటల  ఉన్నారన్నారు. గాంధీ ఆస్పత్రిలో చేరాలంటేనే భయమేస్తుందంటూ ప్రజలు ఫేస్‌బుక్ లో పెడుతున్నా.. సీఎం ఇంత వరకు ఎందుకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.