జూలూరుపాడు,వెలుగు: గ్రామాలు అభివృద్ధి చెందాలంటే సర్పంచ్ లదే కీలక పాత్ర అని ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో యల్లంకి ఫంక్షన్ హాల్ లో గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లను సన్మానించారు. గ్రామంలో అందరూ ఐక్యంగా ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
మండల వ్యాప్తంగా 18కి పైగా గ్రామపంచాయతీలను హస్తగతం చేసుకున్నామని, రాబోయే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్, జిల్లా నాయకులు లేళ్ల వెంకటరెడ్డి, మధుసూదనరావు, రామిశెట్టి రాంబాబు, సర్పంచులు కొర్సా రమేశ్, మంగూలాల్, రాంబాబు, నరేశ్, చింతా జగన్నాథం, కృష్ణ, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
