ఫోన్ ట్యాపింగ్ గురించి నిజాలు బయటపెడతా : కేసీఆర్

ఫోన్ ట్యాపింగ్ గురించి నిజాలు బయటపెడతా : కేసీఆర్

రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ గురించి రెండుమూడు రోజుల్లో స్పందిస్తానని చెప్పారు.ఈ వ్యవహారంలో నిజా నిజాలతో మీడియా ముందుకు వస్తాన్నారు. పదేళ్లు సీఎం ఉన్నా..ఖచ్చితంగా క్లారిటీ ఇస్తానన్నారు కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్  సంబంధించిన నిజాలు బయటపెడతా అన్నారు.

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కటికూడా నెరవేర్చలేదని విమర్శించారు కేనీఆర్.. నీటి నిర్వహణ తెలియని దద్దమ్మలు రాజ్యమేలుతున్నారని కేసీఆర్ విరుచుకుపడ్డారు. వర్షంలేదని మంత్రులు అడ్డ గోలుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇప్పటికీ రైతుబంధు పూర్తి స్థాయిలో ఇవ్వలేదన్నారు కేసీఆర్. 


కాళేశ్వరం ప్రాజెక్టుతో సజీవ జలధారలను సృష్టించామన్నారు బీఆర్ ఎస్ చీఫ్ కేసీఆర్. గోదావరి నదిని నిండుగా ప్రవహించేలా చేశామన్నారు. నాలుగైదు నెలల్లో ఇవన్నీ ఎడారిగా మారాయని తెలిపారు. ఉమ్మడి కరీంనగర జిల్లాలో పలు ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించారు. అనంతరం సిరిసిల్లలోని బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 

తెలంగాణలో 2014 రోజులు మళ్లీ మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి నిర్వహణ తెలియని దద్దమమ్మలు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరువుకాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువేనని కేసీఆర్ విమర్శించారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల మేర పంటలు ఎండిపోయిందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో పంటలు ఎండని జిల్లా లేదన్నారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో పడిందన్నారు.