ప్రాజెక్టులను కేసీఆరే కేఆర్ఎంబీకి అప్పగించారు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ప్రాజెక్టులను కేసీఆరే కేఆర్ఎంబీకి అప్పగించారు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణ ఏర్పడ్డాకే కృష్ణా నీటిలో తెలంగాణకి ఎక్కువ అన్యాయం జరిగిందని ఆరోపించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  బీఆర్ఎస్ నాయకుల ఆసమర్థత వల్లే  కృష్ణ జల్లాలో రైతులకు అన్యాయం జరిగిందన్నారు.  కృష్ణా రివర్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఇవ్వడానికి తాము ఎక్కడా కూడా ఒప్పుకోలేదని చెప్పారు.  అపెక్స్  కౌన్సిల్ మీటింగ్ లకు పిలిస్తే జగన్, కేసీఆర్ వెళ్లలేదని ఆరోపించారు.  

మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు మంత్రి ఉత్తమ్. కేసీఆర్,  జగన్ కలిసి తెలంగాణకు రావాల్సిన నీటి వాటా పై కుట్ర చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించారని అన్నారు. బోర్డుకు కేసీఆర్ సర్కార్ నిధులు ఇచ్చిందని చెప్పారు. రాయలసీమ లిఫ్ట్ కు ఓకే చెప్పేందుకే కేసీఆర్ అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ కు పోలేదని అన్నారు. వీరిద్దరు రహస్యంగా కలిసిన కొన్ని రోజులకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభమైందని చెప్పారు. 

 పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకి 27 వేల 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉండి కల్వకుర్తి, భీమాసాగర్, కోయిల్ సాగర్, ఎస్ఎల్బీసీ పూర్తి చేయలేదని విమర్శించారు. 95 వేల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని అన్నారు. ఉద్యమ సమయంలో హరీష్ రావు, కేసీఆర్ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు. హరీష్ రావు వేరే వాళ్ల సావుకు కారణం అయ్యారని చెప్పారు.
 
 తెలంగాణ రావడానికి ముఖ్యకారణం చిదంబరం ఆల్ పార్టీ మీటింగ్ అని చెప్పారు.  రాజకీయ కుట్రలో భాగంగానే నాగర్జున సాగర్ పై ఓటింగ్ రోజు మందిని పంపారని ఆరోపించారు. ప్రాజెక్టులు తాము కేఆర్ఎంబీకి అప్పగించామనేది అబద్దపు ప్రచారమని దాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.