రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కేసీఆరే : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది కేసీఆరే : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోనియా గాంధీ ధనిక రాష్ట్రంగా తెలంగాణను ఇస్తే, కేసీఆర్ కుటుంబం తన స్వార్థం కోసం రాష్ట్రాన్ని దివాలా తీయించిందని మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం సీఎల్‌‌‌‌‌‌‌‌పీ మీడియా సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రంలో చెబుతున్న అబద్ధాలు చాలవన్నట్టు కేటీఆర్ ఇప్పుడు మలేసియా వెళ్లి అబద్ధాలు చెబుతున్నారని, ఆయన అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా మారారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారని,  ఆత్మగౌరవాన్ని వదులుకోరని, అందుకే అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి వరకు ప్రతి ఎన్నికలో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ను చిత్తుగా ఓడించారని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80కిపైగా సీట్లు సాధిస్తుందని, రేవంత్ రెడ్డే మళ్లీ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌కు కనీసం అభ్యర్థులు కూడా దొరకరని, ఆ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు.