కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం

కరోనా వైరస్ కంటే కేసీఆర్ ప్రమాదకరం

రాష్ట్రంలో కరోనా వైరస్ కంటే సీఎం కేసీఆర్ ప్రమాదకరమన్నారు మందకృష్ణ మాదిగ.  కేసీఆర్ కు ప్రజాప్రతినిధుల ప్రాణాలపై ఉన్న ప్రేమ… సామాన్య ప్రజలపై లేదన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్ ను మహమ్మరిగా గుర్తిస్తే దానిపై కూడా కేసీఆర్ రెండు నాలుకల ధోరణిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఐక్య వేదిక కన్వీనర్లు ఎమ్మెల్సీ రాములు నాయక్ , మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంద కృష్ణ మాదిగ.. స్కూల్స్, యూనివర్శిటీలు అన్నింటిని బంద్ చేస్తున్నా అంగన్ వాడి కేంద్రాలను ఎందుకు కొనసాగిస్తున్నారన్నారని ప్రశ్నించారు. అంగన్ వాడి కేంద్రాలలో అత్యధికంగా చిన్న పిల్లలు ఉంటారని వారికే ఎక్కువ వైరస్ సోకే ప్రమాదం ఉంటుందనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలన్నారు.

200 వందల నుండి 500 వందల మంది ఉండే సినిమా హాళ్లు, పబ్బులు, బార్లు మూసివేశారు కానీ నిత్యం వేలాది మంది వచ్చి వెళ్లే వైన్స్ షాపులు ఎందుకు మూసివేయలేదన్నారు .రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 30 వేల వైన్ షాపులలో రోజుకు లక్షల్లో ప్రజలు మద్యం సేవిస్తున్నారని… వారికి వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందన్నారు. ఈ నెల 20 వరకు కొనసాగాల్సిన అసెంబ్లీ సమావేశాలను  ఎందుకు వాయిదా వేశారన్నారు.  వైరస్ ప్రభావం ఉన్నంత వరకు రాష్ట్రంలో వైన్ షాపులను మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి 24 గంటల సమయం ఇస్తున్నామన్నారు. ఫస్ట్ ఎక్సైజ్ అధికారులకు మెమోరాండం ఇస్తామని. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే  ప్రత్యేక్ష ఆందోళనకు దిగుతామన్నారు.