గ్రూప్1 రద్దుకు కేసీఆర్ దే బాధ్యత: షర్మిల

గ్రూప్1 రద్దుకు కేసీఆర్ దే బాధ్యత: షర్మిల

హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 1 పరీక్ష రద్దుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని, నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రభుత్వం పకడ్బందీగా పరీక్ష నిర్వహించి ఉంటే, ఇప్పుడు మరోసారి 2.37 లక్షల మంది గ్రూప్ 1 అభ్యర్థులకు నష్టం జరిగేది కాదన్నారు.

‘‘టీఎస్ పీఎస్సీకి విశ్వసనీయత లేదని చెప్పినా.. దర్యాప్తు జరుగుతున్నప్పుడు పాత బోర్డుతో పరీక్షలు వద్దని మొత్తుకున్నా.. బయోమెట్రిక్ విధానాన్ని ఎందుకు ఎత్తివేశారని నెత్తి నోరు బాదుకున్నా.. వినకుండా ప్రభుత్వం పరీక్ష పెట్టింది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు.. ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది” అని శనివారం ట్వీట్ చేశారు.