కేసీఆర్‌ది నియంత పాలన: నారాయణ

కేసీఆర్‌ది నియంత పాలన: నారాయణ

ఆర్టీసీ సమ్మె ఉదృతంగా మారేందుకు సీఎం కేసీఆర్ నియంత పాలనే కారణమన్నారు సీపీఐ జాతీయ నేత నారాయణ. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపకుండా వారు సెల్ఫ్ డిస్మిస్ అయ్యారంటూ కేసీఆర్ ప్రకటిచండం అనైతికమన్నారు. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడటం చాలా బాధాకరమని…తెలంగాణ సాధనలో కార్మికుల పోరాటం మరువలేనిదని చెప్పారు. నియమించిన తాత్కాలిక కార్మికులు, ఆర్టీసీ కార్మికుల మధ్య అంతర్యుద్ధం నడుపుతున్నారని నారాయణ ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులంతా ధైర్యంగా ఉండాలన్నారు.  చనిపోయిన ఒక్కో కార్మికుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి చొప్పున నష్ట పరిహారం చెల్లించడంతో పాటు వారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం, సొంత ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు నారాయణ.