హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ ఉదయం జైపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను ఓదార్చిన సీఎం జగన్.. ఆ తర్వాత రాజ్ భవన్ కు వెళ్లారు. గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఆ తర్వాత నేరుగా ప్రగతి భవన్ కు వచ్చారు.
ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో కేసీఆర్ తో కలిసి లంచ్ చేశారు జగన్. ఆ తర్వాత రెండు రాష్ట్రాల మధ్య అంశాలపై కొద్దిసేపు మాట్లాడారు. తన జెరూసలేం పర్యటనపైనా జగన్.. కేసీఆర్ తో చర్చించారు. సాయంత్రం జెరూసలేం బయల్దేరి వెళ్లారు జగన్.
