కేసీఆర్ టూర్ ఎఫెక్ట్.. కరీనంగర్ - జగిత్యాల్లో ట్రాఫిక్ జామ్

కేసీఆర్ టూర్ ఎఫెక్ట్.. కరీనంగర్ - జగిత్యాల్లో ట్రాఫిక్ జామ్

సీఎం కేసీఆర్ జగిత్యాల టూర్  నేపథ్యంలో కరీంనగర్ - జగిత్యాల మార్గంలో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇవాళ జగిత్యాలలో పర్యటించిన కేసీఆర్  పార్టీ జిల్లా కార్యాలయాన్ని, కలెక్టరేట్‌ను ప్రారంభించారు.  అనంతరం మోతె బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్ మరో 10 రోజుల్లో రైతు బంధు డబ్బులు జమ అవుతాయని చెప్పారు. బండలింగాపూర్ ను మండలం చేస్తామని ప్రకటించారు.

కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లు

కొండగట్టు ఆలయాన్ని దేశంలోనే గొప్ప ఆలయంగా అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. దేశమే నివ్వెర పోయేలా ఆలయాన్నినిర్మిస్తామన్నారు. తానే వచ్చి నిర్మాణాలను మొదలు పెడతామన్నారు. అంజన్న ఆలయానికి ఇప్పటికే 384 ఎకరాలు ఇచ్చామన్నారు. ప్రఖ్యాత స్థపతులను తీసుకొచ్చి కొండగట్టును డెవలప్ చేస్తామన్నారు. యాదాద్రి క్షేత్రం వలే కొండగట్టును అభివృద్ధి చేస్తామని చెప్పారు.