కేసీఆర్, కేటీఆర్ సిటీ రోడ్లపై బండి మీద తిరిగితే తెలుస్తది

V6 Velugu Posted on Jul 31, 2021

TRS  నాయకులను ప్రజలు తరిమి కొట్టే రోజులు తొందరలోనే వస్తాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. తండ్రి కేసీఆర్, కొడుకు కేటీఆర్ చేసిన పాపం మున్సిపల్ కార్పోరేషన్ భరిస్తోందని విమర్శించారు. GHMC లో రోడ్ల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా రోడ్లు దారుణంగా ఉన్నాయని తెలిపారు. అయ్యా, కొడుకు ఇద్దరు బండి పై తిరిగితే ..అప్పుడు రోడ్ల పరిస్థితి ఎలా ఉందో తెలుస్తుందన్నారు.

హుజురాబాద్ లో గెలవాలని మాత్రమే కేసీఆర్, కేటీఆర్ చూస్తున్నారని.. కానీ అక్కడ రోడ్ల పరిస్థితి ఎలా ఉందని మాత్రం తెలుసుకోవడం లేదన్నారు రాజాసింగ్.ఉత్తుత్తి స్కీంలు పెట్టి హుజురాబాద్  ప్రజలను బేవకూబ్ లను చేయాలని చూస్తున్నారన్నారు. అక్కడ గెలిచేది కేవలం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు.

Tagged KCR, KTR , MLA Raja Singh, return, two wheeler, city roads

Latest Videos

Subscribe Now

More News