కేసీఆర్‌ నాయకత్వం దేశానికి ఆదర్శం: కేటీఆర్

కేసీఆర్‌ నాయకత్వం దేశానికి ఆదర్శం: కేటీఆర్

కేసీఆర్‌ నాయకత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు TRS పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR. రంగారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో జరుగుతున్న జహీరాబాద్‌ నియోజకవర్గ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌, బీజేపీలు దేశాన్ని 70 ఏళ్లు పాలించాయన్నారు. ఇంకా దేశంలో విద్యుత్‌, నీళ్లు, రోడ్లు లేని గ్రామాలున్నాయన్నారు. మహారాష్ట్రలోని ప్రజలు తెలంగాణలో కలుస్తామని చెబుతున్నారన్నారు. రాష్ట్ర సరిహద్దులోని 40 గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తామంటున్నారని చెప్పారు. జహీరాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలోనే కేసీఆర్‌ పూర్వీకులున్నారన్నారు. ఏళ్ల క్రితం అప్పర్‌ మానేరు ప్రాజెక్టు కింద పోసాన్‌పల్లి మునిగిపోయిందన్నారు. ఆ సమయంలో కేసీఆర్‌ పూర్వీకులు పోసాన్‌ పల్లి నుంచి సిద్దిపేట జిల్లా చింతమడక తరలివచ్చారని గుర్తు చేశారు కేటీఆర్.