సిద్దిపేటలో బిజీబిజీగా సీఎం కేసీఆర్

V6 Velugu Posted on Jun 20, 2021

సిద్థిపేట లో బిజీగా ఉన్నారు సీఎం కేసీఆర్. పలు అభివృద్ది పనులను ప్రారంభించారు. సిద్ధిపేట శివారు ప్రాంతంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించారు. మంత్రులు మహమూద్ అలీ, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు  కొత్తగా కట్టించిన పోలీస్ కమిషనరేట్ ఆఫీస్ ను ప్రారంభించారు కేసీఆర్.   సిద్దిపేట టౌన్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించారు. ఆఫీస్ ముందు శిలాఫలం ఆవిష్కరించారు. ప్రత్యేక పూజలు చేసి క్యాంప్ ఆఫీస్ రిబ్బన్ కట్ చేశారు సీఎం. కాసేపటి  తర్వాత కలెక్టరేట్ లో జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశం కానున్నారు.

ప్రజల దగ్గరకు పాలన తెచ్చేలా, పరిపాలన సౌలభ్యం కోసం ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్ల నిర్మాణం చేపట్టామన్నారు ప్రజాప్రతినిధులు. అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు, ఉద్యోగులకు సౌకర్యంగా ఉండేలా కలెక్టరేట్ బిల్డింగ్ నిర్మించామని చెప్పారు.  హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో సిద్ధిపేటకు వెళ్ళిన కేసీఆర్ కు అక్కడ జిల్లా మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా ముఖ్య నేతలు  స్వాగతం పలికారు.  
 

Tagged KCR opened the collecterate and Police Commissionerate officess in Siddipet

Latest Videos

Subscribe Now

More News