కేసీఆర్ వల్లే తెలంగాణ సస్యశ్యామలం

కేసీఆర్ వల్లే తెలంగాణ సస్యశ్యామలం
  • కూలీలతో ముచ్చటించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జనగామ / మహబూబాబాద్: సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ సస్యశ్యామలమైందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పెద్ద వంగర , కొడకండ్ల మండలాల పరిధిలోని గంట్ల కుంట, రంగా పూర్  రైతు కూలీల తో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కొద్ది సేపు ముచ్చటించారు. అటుగా వెళుతూ... మార్గ మధ్యంలో కూలీలను చూసి తన వాహనాన్ని అపారు మంత్రి. అనంతరం వారితో కొద్దిసేపు మాట్లాడారు. కేసీఆర్ పథకాలు ఎలా ఉన్నాయి? రైతు బంధు నిధులు అందుతున్నాయా? పెన్షన్లు వస్తున్నాయా? స్త్రీ నిధి నిధులు అందుతున్నాయా? అంటూ ఆరా తీశారు. సీఎం కేసీఆర్ దయవల్ల సమృద్ధిగా సాగు నీరు అందుతోందని, కరెంట్ కోతలు కూడా లేవని రైతు కూలీలు మంత్రి కి చెప్పారు. అయితే ఈ యాసంగి పంటలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని వారు మంత్రిని కోరారు. కేంద్ర ప్రభుత్వం పంటల కొనుగోలుకు అడ్డు పడుతోందని మంత్రి వారికి వివరించారు. అన్ని విధాలుగా రైతులను, రైతు కూలీలకు సీఎం ఆదుకుంటారని చెప్పారు. 

మరి కొన్ని వార్తల కోసం:

బాబూ బడికి వెళ్లు

సీఎం అభ్యర్థిగా చన్నీ ఓకే అన్న సిద్ధూ