దీవించండి..దేశం కోసం పిడికిలి బిగిస్తా: సీఎం కేసీఆర్

దీవించండి..దేశం కోసం పిడికిలి బిగిస్తా: సీఎం కేసీఆర్

భువనగిరి ఎన్నికల సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నామని తెలిపారు. దేశంలో ఉన్న వనరులను ఉపయోగించుకోవడంలో కాంగ్రెస్, బీజేపీలు ఫేయిల్ అయ్యాయని అన్నారు. ప్రపంచంలో సహజవనరులు అధికంగా ఉన్న దేశం మనదే అని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఢిల్లీ నాయకులకు గులాములని విమర్శించారు.  దేశం మొత్తానికి తెలంగాణ దిక్సూచిలా ఉందని చెప్పారు. పిడికిలి బిగించి ఉద్యమం సాగిస్తే.. తెలంగాణ వచ్చిందని అన్నారు. ప్రజలు దీవిస్తే దేశాన్ని మార్చేందుకు పిడికిలి బిగిస్తా అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ నుండి టీఆర్ఎస్ తరపున 16మంది ఎంపీలు గెలిచి దేశం కోసం పొలికేక పెట్టాలె అని అన్నారు. RBI దగ్గర 20 లక్షల కోట్లు నిరుపయోగంగా పడి ఉన్నాయని వాటిని వాడుకునే తెలివి తేటలు మన నాయకుల దగ్గర లేవని చెప్పారు. నాలుగున్నర ఏళ్లలో తెలంగాణ చిత్రాన్ని ప్రగతి పథంలో నడిపినట్టే దేశాన్ని కూడా నడపాలి అని అన్నారు.  ఉద్యమ సమయంలో డాక్టర్లందరిని ఏకం చేసిన వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ అని కేసీఆర్ ప్రశంసించారు. ఆయన్ని మళ్లీ భువనగిరి ఎంపీగా గెటిపించాలని ప్రజలను  కోరారు కేసీఆర్.