లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను: బూర నర్సయ్య గౌడ్

లక్ష కోట్ల ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కన్ను: బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీకి చెందిన సుమారు రూ.లక్ష కోట్ల విలువైన ఆస్తులపై సీఎం కేసీ ఆర్ కన్ను పడిందని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఓఆర్ఆర్ మాదిరిగానే ఆర్టీసీ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఆస్తులను ముట్టుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. 

ఆర్టీసీలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సైతం ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకుంటేనే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆర్టీసీ కార్మికులపై నిజమైన ప్రేమ ఉన్నట్లన్నారు. ఆర్టీసీ భూములను కేసీఆర్.. బీఆర్ఎస్ నేతలకు లీజుకు ఇచ్చారని ఆరోపించారు. మెట్రో విస్తరణ అనేది రియల్ విస్తరణనా లేక రీల్ విస్తరణనా.. మంత్రి కేటీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను చూస్తే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ గుర్తుకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమ పథకాల అమలులో ప్రధాని మోదీని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని సూచించారు.