కేంద్రం దగ్గరకు వెళ్తే విమాన ఖర్చులు దండగ

కేంద్రం దగ్గరకు వెళ్తే విమాన ఖర్చులు దండగ

వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి   తాము కొనబోమన్నారు సీఎం కేసీఆర్. పేగులు తెగేదాకా కేంద్రంతో కొట్లాడినామన్నారు. కేంద్రం దగ్గరకు వెళ్తే విమాన ఖర్చులు దండగన్నారు. యాసంగిలో రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలుండవన్నారు. కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు.  దమ్ముంటే కిషన్ రెడ్డి కేంద్రంతో తెలంగాణ నుంచి ధాన్యం కొనిపించాలన్నారు.  కిషన్ రెడ్డి వల్ల రాష్ట్రానికి ప్రయోజనం లేదన్నారు. దేశంలో 755 మంది రైతులను పొట్టన పెట్టుకున్న హంతకుల పార్టీ బీజేపీ అని అన్నారు. తాము రైతుబంధువులమని.. బీజేపీ రైతు రాబంధువుల పార్టీ అని అన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని అన్నారు.  క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోలో రేట్లు పెంచారన్నారు. రాష్ట్రం నుంచి రైతుల తరపున మంత్రుల బృందం వెళ్తే.. మీకేం పనిలేదా అని కేంద్రమంత్రి ఎలా అంటారన్నారు.  రాష్ట్రంలో వ్యాట్ తగ్గించాలని నిరసనలెందుకన్నారు. బీజేపీ వాల్లు ముంచెటోళ్లే తప్ప మంచి చేసేవాళ్లు కాదన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులను ఢిల్లీలో పట్టించుకోరన్నారు.