కేసీఆర్ ను కాపాడేందుకే... సీబీఐ విచారణ కోరుతుండ్రు

కేసీఆర్ ను కాపాడేందుకే... సీబీఐ విచారణ కోరుతుండ్రు
  •  బీజేపీ ధర్నా ఆశ్చర్యకరం

  •   ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

హైదరాబాద్: కేసీఆర్ ను కాపాడేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని, అందులో బాగంగానే సీబీఐ విచారణ కోరుతోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ( మే31)  గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ దోషులను శిక్షించాలని కోరుతూ.. బీఆర్ఎస్ మిత్రపక్షమైన బీజేపీ ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీకి ఎలా కొమ్ముకాసిందో చూశామని చెప్పారు. 

ఇందుకు ప్రతిఫలంగా కేసీఆర్ ను కాపాడాలని బీజేపీ చూస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఐదు నెలల కాలంలో కాళేశ్వరంపై కేంద్ర బృందాలతో తనిఖీలు చేయించి నివేదికలు సిద్ధం చేసిందని, జ్యుడీషియల్ ఎంక్వైరీ నడుస్తోందని చెప్పారు. ఇంత చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ బీజేపీ అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు. ఈడీ, ఐటీ, సీబీఐ కేసులు పెట్టి పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ లీడర్లు చూస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, బీఆర్ఎస్ డ్రామాలు ఆపాలని డిమాండ్ చేశారు.