
మరో 20 ఏళ్లు అధికారం టీఆర్ఎస్ దేనని..అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ భవన్ లో TRSరాష్ట్ర కమిటీ సమావేశానికి హాజరైన కేసీఆర్..దళిత బందుపై ప్రతిపక్షాల ఆరోపణలు తిప్పికొట్టాలని ఆదేశించారు. అన్ని వర్గాలకంటే దళితులు వెనుకపడ్డారు కాబట్టే మొదట వారికోసం దళిత బంధు తీసుకొచ్చామన్నారు.దళిత బంధు పై ప్రజలను చైతన్యం చేయాలన్నారు. దళిత బంధును ఉద్యమంలా చేయాలన్నారు.టివి ఛానల్ డిబేట్ లలో ప్రతిపక్షాల తప్పుడు విమర్శల్ని తిప్పి కొట్టాలని సూచించారు.
ఈ నెలాఖరు వరకు మెంబర్ షిప్ పూర్తి చేయాలన్నారు.సెప్టెంబర్ 2 న ఢిల్లీలో తెలంగాణ భవన్ కు శంకుస్థాపన చేస్తామన్నారు. మొదటి వారంలో గ్రామ కమిటీలు, రెండోవారంలో మండల కమిటీలు, మూడో వారం లో జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అక్టోబర్ లో రాష్ట్ర కమిటీలు పూర్తిచేసుకోవాలని ఆదేశించారు కేసీఆర్.