కాన్వాయ్ ఆపి దాబాలో చాయ్ తాగిన కేసీఆర్

కాన్వాయ్ ఆపి  దాబాలో చాయ్ తాగిన కేసీఆర్

సిరిసిల్ల, సిద్దిపేటలో అక్టోబర్ 17న  ప్రజా ఆశీర్వాద సభలను ముగించుకుని హైదరాబాద్‌కు వెళ్తూ దారిలో కేసీఆర్ కొద్ది సేపు టీ బ్రేక్ తీసుకున్నారు. గతంలో సిద్దిపేట బైపాస్‌లో ఉన్న దాబాల్లో చాయ్ తాగిన రోజులు గుర్తుకొచ్చి కాన్వాయ్‌ని వెనక్కి తిప్పించారు. పొన్నాల వద్ద సోనీ దాబాకు వెళ్లి.. నేతలతో కలిసి చాయ్​తాగారు. నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. దాబాలో కేసీఆర్ చాయ్ ​తాగుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

Also Read :- బతుకమ్మ పండుగకు సెలవు లేదు

కేటీఆర్ వల్లే నేతన్నల ఆత్మహత్యలు ఆగినయ్

ఒకప్పుడు ఉరిసిల్లగా ఉన్న సిరిసిల్ల రూపురేఖలు మంత్రి కేటీఆర్​వల్ల మారిపోయాయని సీఎం కేసీఆర్ అన్నారు. కేటీఆర్ చొరవతో నేతన్నల ఆత్మహత్యలు ఆగాయని చెప్పారు. ‘‘బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక సిరిసిల్లను షోలాపూర్, సూరత్‌‌లా తయారు చేస్తాం. సిరిసిల్ల మరో షోలాపూర్​గా మారాలంటే కేటీఆర్‌‌‌‌ను భారీ మెజారిటీతో గెలిపించండి’’ అని కోరారు. మంగళవారం సిరిసిల్ల, సిద్దిపేటలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు సీఎం హాజరై మాట్లాడారు.