బతుకమ్మ పండుగకు సెలవు లేదు : జేఎన్టీయూహెచ్​ నిర్ణయం

బతుకమ్మ పండుగకు సెలవు లేదు : జేఎన్టీయూహెచ్​ నిర్ణయం
  • బతుకమ్మ పండుగకు సెలవు లేదు
  • జేఎన్టీయూహెచ్​ నిర్ణయం 

హైదరాబాద్, వెలుగు: బతుకమ్మ పండుగకు జేఎన్టీయూహెచ్ సెలవులు ఇవ్వలేదు. అకడమిక్ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 నుంచి 28 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్టు గతంలో ప్రకటించింది. ప్రభుత్వం దసరా సెలవును ఒకరోజు ముందుకు జరపగా జేఎన్టీయూహెచ్ అధికారులు మాత్రం పాత షెడ్యూల్ ప్రకారమే సెలవులు ఇస్తామని తెలిపారు. 

దాంతో ఈ నెల 21న జరగనున్న రాష్ట్రపండుగపై అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై  లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్సిటీలో బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీటెక్, ఎంటెక్ చదువుతున్న స్టూడెంట్లకు సెలవులు లేనట్లే అని తెలుస్తున్నది.