మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవనున్న తెలంగాణ సీఎం

మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కలవనున్న తెలంగాణ సీఎం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు మహారాష్ట్రలోని ముంబై వెళుతున్నారు. ఇటీవల కేసీఆర్‌కు ఫోన్‌ చేసి లంచ్‌కు రావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే ఆహ్వానించిన విషయం తెలిసిందే. రేపు ఉదయం 11 గంటలకు సీఎం బేంగపేట నుంచి బయలుదేరి ముంబైకి వెళ్ళనున్నారు. మధ్యాహ్నం లంచ్‌ చేసి.. దేశంలో ప్రస్తుతం నెలకొన్ని రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చించనున్నారు.  ఈ భేటీలో దేశ రాజకీయాలపై కీలక చర్చ జరగనుంది. ఇటీవలే పీపుల్స్ ఫ్రంట్‌ ఏర్పాటు కాబోతుందని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో ఈ చర్చల్లో ఇదే ప్రధాన ఎజెండాగా ఉండనున్నట్టు తెలుస్తోంది. దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు చేపట్టాల్సిన భవిష్యత్‌ కార్యచరణపై చర్చలు జరుగనున్నట్టు తెలుస్తోంది.

జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని చెబుతున్న కేసీఆర్‌ పదే పదే రాహుల్‌ పేరు ప్రస్తావిస్తూ... కాంగ్రెస్‌ పట్ల కాస్త మెతక ధోరణి అవలంబిస్తున్నారు. కాని రాజకీయ విశ్లేషకులు మాత్రం నాన్‌ బీజేపీ, నాన్‌ కాంగ్రెస్‌ కూటమి కోసం కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. ఉద్ధవ్‌ థాకరేతో భేటీ తరవాత రాత్రికి కేసీఆర్‌ హైదరాబాద్‌ చేరుకోనున్నారు. 

ఇవి కూడా చదవండి:

ఆప్ మాజీ నేతకు కేంద్రం భారీ భద్రత