ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం

ఫిబ్రవరి  1న ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం

హైదరాబాద్, వెలుగు: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంబర్‌‌‌‌లో ఆయన ప్రమాణం చేస్తారని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు.

గతేడాది నవంబర్‌‌‌‌ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డిసెంబర్ మొదటి వారంలో ఎర్రవెల్లిలోని తన ఫాం హౌస్‌‌లో ఆయన జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయారు.