Sourav Ganguly: క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా కొనసాగుతూనే, ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడంపై వస్తున్న 'కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్' ఆరోపణలను టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) పూర్తిగా తోసిపుచ్చారు. ఈ అంశంపై బీసీసీఐ అంబ్‌డెడ్సన్ నుంచి తనకు స్పష్టమైన అనుమతి ఉత్తర్వులు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. భారత్– ఉరుగ్వే ఫుట్‌బాల్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన గంగూలీ ఈ విషయాలపై క్లారిటీ ఇచ్చారు.
అంబ్‌డెడ్సన్ ఆర్డర్ నా దగ్గర ఉంది: గంగూలీ
నా దగ్గర అంబ్‌డెడ్సన్ ఆర్డర్ ఉందని స్పష్టం చేసిన గంగూలీ.. ఐపీఎల్ 2027 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సరికొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. హేమంత్ బదాని స్థానంలో ఢిల్లీ కోచ్ బాధ్యతలు చేపట్టనున్న గంగూలీకి ఐపీఎల్‌లో హెడ్ కోచ్‌గా ఇదే తొలి అవకాశం కావడం విశేషం. అయితే, గతంలో డీసీ సిస్టర్ ఫ్రాంచైజీ అయిన ఎస్‌ఏ20 (SA20) లీగ్‌లో ప్రెటోరియా క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు చేర్చిన అనుభవం ఆయన సొంతం. 2019 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌తో కొనసాగుతున్న దాదా.. ఇంతకుముందు మెన్స్, ఉమెన్స్ టీమ్‌లకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా సేవలందించారు.
స్టార్-స్టడెడ్ సపోర్ట్ స్టాఫ్:
* రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. గంగూలీతో పాటు మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, శ్రీలంక పేస్ లెజెండ్ చమిందా వాస్, అనుభవజ్ఞుడైన స్పిన్నర్ అమిత్ మిశ్రా తదితరులు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాక్‌రూమ్ సపోర్ట్ స్టాఫ్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది.
►ALSO READ | 2027 వరల్డ్ కప్‌లో బుమ్రా, భువీ ఆడతారా?.. అశ్విన్ బిగ్ స్టేట్‌మెంట్!
* అక్షర్ పటేల్ కెప్టెన్సీలో.. కేఎల్ రాహుల్ తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ నుంచి తిరిగి వస్తున్న రిషబ్ పంత్ చేరికతో ఢిల్లీ జట్టు మరింత పటిష్టంగా మారింది. గత సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఈసారి సౌరవ్ గంగూలీ మార్గదర్శకత్వంలో అదరగొట్టాలని పట్టుదలగా ఉంది.
రాబోయే సీజన్‌పై గంగూలీ ధీమా:
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రదర్శనపై గంగూలీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ చాలా బాగా ఆడుతుంది.. నేను దీని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని దాదా పేర్కొన్నారు. కొత్త కోచింగ్ స్టాఫ్, అనుభవజ్ఞులైన ఆటగాళ్ల కలయికతో డీసీ ఈసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగే అవకాశం ఉంది.
