కేసీఆర్కు మునుగోడు భయం పట్టుకుంది

కేసీఆర్కు మునుగోడు భయం పట్టుకుంది

సీఎం కేసీఆర్ అవినీతి చిట్టా మునుగోడులో బయటపెడ్తామని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ బండి సంజయ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి మునుగోడు భయం పట్టుకుందని.. అందుకే నిన్నటి సభలో అర్థంపర్థం లేకుండా మాట్లాడారని అన్నారు. మునుగోడు వేదికగా ముఖ్యమంత్రి అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తామని బండి స్పష్టం చేశారు. సూది దబ్బనంతో పోల్చిన వామపక్షాలతో ఇప్పుడు కేసీఆర్ తో ఎలా జత కడతారని ప్రశ్నించారు. అంతకు ముందు బండి సంజయ్ హైదరాబాద్ కు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాకు బేగంపేట ఎయిర్ పోర్టులో స్వాగతం పలికారు.

కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలన నుంచి విమక్తి కల్పించి బంగారు తెలంగాణ కోసమే కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చినట్లు రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ అన్నారు. కేసీఆర్ అహంకారాన్ని అణిచేందుకే ఆయన వచ్చినట్లు చెప్పారు. త్వరలోనే బండి సంజయ్ ఆధ్వర్యంలో భారీ సభ నిర్వహించనున్నట్లు చుగ్  ప్రకటించారు.