లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ కొత్త​ ప్లాన్

 లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ కొత్త​ ప్లాన్
  • లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ కొత్త​ ప్లాన్
  • కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అని జనంతోనే చెప్పించే ఎత్తుగడ
  • భారీ సభలకు బదులు చిన్న సమావేశాలపైనే బీఆర్ఎస్​ ఫోకస్

హైదరాబాద్, వెలుగు: లోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ప్రచారంలో కొత్త వ్యూహాలను అవలంబించాలని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా ఉదయం పూట రైతుల వద్దకు వెళ్లి కలుస్తానని, సాయంత్రం యాత్ర చేస్తానని ఇటీవల జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ చెప్పుకొచ్చారు. అక్కడే జనాలతో ముఖాముఖి కార్యక్రమాలను నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలు, వ్యాపారులు, మిల్లర్లు, డ్రైవర్లు, ప్రైవేటు ఉద్యోగులతో వేర్వేరుగా ముఖాముఖి కార్యక్రమాలను ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఒక్కో రోజు.. ఒక్కో వర్గంతో ముఖాముఖి నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో తొలుత జనాలతో మాట్లాడించి, చివరలో కేసీఆర్ ప్రసంగం, సమాధానాలు ఉండేలా ప్రణాళిక రచిస్తున్నారు. భారీ సభల తరహాలో కాకుండా లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సెలెక్టెడ్ మెంబర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముఖాముఖి నిర్వహించాలని యోచిస్తున్నారు. ఈ కార్యక్రమాలను యూట్యూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. తద్వారా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.

జనాలతో తిట్టించే ప్రయత్నం

కేసీఆర్ స్పీచులకు జనాల్లో ఇదివరకటిలా ఆదరణ కనిపించడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేయడం, గత బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ అద్భు తం అని చెప్పడం రొటీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిపోయింది. ఈ తరహా విమర్శలకు, సొంత ప్రశంసలకు జనాల్లో స్పందన కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే ముఖా ముఖి ప్రోగ్రామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టి, జనాలతోనే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పించే  ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ముందుగానే పార్టీ కార్యకర్తల్లో కొంత మందిని ఎంచుకుని శిక్షణ ఇవ్వనున్నట్టు సమాచారం. కేసీఆర్ కూడా తన పంథాను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ నిత్యం జనాల్లో ఉండేవారు. ఆయన చుట్టూ ఎప్పుడూ పదు ల సంఖ్యలో లీడర్లు, కేడర్ ఉండేది. కానీ, అధికారం లోకి వచ్చాక సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలుసుడు కష్టమైపోయింది. ప్రగతిభవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోనో, ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్​లోనే ఉండడం తప్పితే, కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా అరుదుగా జనాల్లోకి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఇది కూడా ఓ కారణమేనని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గులాబీ బాస్ కూడా గతంలో మాదిరిగా జనాలను, పార్టీ నేతలను కలవాలని అనుకుంటున్నారని బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సీనియర్లు చెబుతున్నారు. ఉద్యమం నాటి కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూస్తారంటూ ఇటీవల జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు.

17 రోజులు.. 22 రోడ్​ షోలు

బీఆర్ఎస్​ అధినేత కేసీఆర్​ బస్సుయాత్ర రూట్​మ్యాప్​ ఖరారైంది. 17 రోజుల పాటు సాగనున్న యాత్రకు సంబంధించి రూట్​ ప్లాన్​ను శనివారం బీఆర్ఎస్​ విడుదల చేసింది. ఈనెల 24 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు నిర్వహించనున్న రోడ్​ షోలలో కేసీఆర్​ పాల్గొంటారని ఆ పార్టీ తెలిపింది. మొత్తం 22 రోడ్​షోలు నిర్వహిస్తామని వెల్లడించింది. బుధవారం మిర్యాలగూడలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే కేసీఆర్  రోడ్​ షో.. మే 10న సిద్దిపేటలో సాయంత్రం 6.30 గంటలకు జరిగే బహిరంగ సభతో ముగియనుందని పేర్కొంది