మెట్రో ఫేజ్ 2 పనులకు శంకుస్థాపన చేయనున్న కేసీఆర్

మెట్రో ఫేజ్ 2 పనులకు శంకుస్థాపన చేయనున్న కేసీఆర్

గచ్చిబౌలి, వెలుగు : మైండ్ స్పేస్ జంక్షన్ (రాయదుర్గం మెట్రో స్టేషన్) నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు చేపట్టనున్న మెట్రో సెకండ్ ఫేజ్ పనులకు ఈ నెల 9న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.   ఈ మేరకు బుధవారం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్​రావు ఉత్తర్వులు జారీ చేశారు. మెట్రో పనుల శంకుస్థాపన అనంతరం రాష్ట్ర పోలీస్ అకాడమీలో సీఎం బహిరంగ సభ ఉండటంతో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మాదాపూర్ ట్రాఫిక్ పీఎస్ పరిధిలో.. (ఉదయం 7.30 నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు)కేపీహెచ్​బీ ఆర్​వోబీ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు ఐకియా అండర్ పాస్ మీదుగా వచ్చే వెహికల్స్ సైబర్​ టవర్​ జంక్షన్​, సీవోడీ సిగ్నల్​ వద్ద రైట్ టర్న్ తీసుకుని  నెక్టార్ గార్డెన్, ఐ ల్యాబ్స్​, ఐటీసీ కోహినూర్ హోటల్​  మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. సైబర్​ టవర్స్ ఫ్లై ఓవర్​ మీదుగా బయోడైవర్సిటీ వైపు వెహికల్స్​ను అనుమతించరు. కేపీహెచ్​బీ ఆర్​వోబీ నుంచి సైబర్ టవర్స్​ ఫ్లై ఓవర్​ మీదుగా గచ్చిబౌలి వైపు వచ్చే వెహికల్స్​ సైబర్​ టవర్స్ జంక్షన్, మెటల్ చార్మినార్, సీఐఐ జంక్షన్, కొత్తగూడ జంక్షన్  వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. హైటెక్స్ నుంచి సైబర్ టవర్స్, బయోడైవర్సిటీ వైపు వచ్చే వెహికల్స్ సైబర్​ టవర్స్,​ సీవోడీ సిగ్నల్ వద్ద రైట్ టర్న్ తీసుకుని నెక్టార్ గార్డెన్, ఐ ల్యాబ్, ఎన్​సీబీ రోడ్ మీదుగా వెళ్లాలి. సీఐఐ, టెక్ మహీంద్రా, డెల్​ కంపెనీ రోడ్ నుంచి బయోడైవర్సిటీ, ఇనార్బిట్ మాల్ వైపు వచ్చే వెహికల్స్ టీసీఎస్​ జంక్షన్ నుంచి లెఫ్ట్, సైబర్​ టవర్స్ వద్ద రైట్ టర్న్ ​తీసుకుని సీవోడీ సిగ్నల్,నెక్టార్​ గార్డెన్, ఐ ల్యాబ్, ఐటీసీ రోడ్​ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. కావూరి హిల్స్​ నుంచి సైబర్​ టవర్స్​, కేపీహెచ్​బీ ఆర్​వోబీ నుంచి సైబర్​ టవర్స్​, సీవోడీ జంక్షన్​, హైటెక్స్ జంక్షన్​నుంచి సైబర్​ టవర్స్, సైబర్​ టవర్స్ నుంచి కొత్తగూడ జంక్షన్, టీసీఎస్​ జంక్షన్ నుంచి సైబర్​ టవర్స్​, ఎన్​ఐఏ నుంచి ఎస్​బీఐ పర్వత్​నగర్​, నీరూస్​ జంక్షన్​నుంచి పర్వత్​నగర్​ వైపు వెళ్లే రూట్లలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండనుంది.

నార్సింగి ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఇలా..(ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు)చేవెళ్ల నుంచి మొయినాబాద్ మీదుగా బండ్లగూడ జాగీర్, కాళీమందిర్​, సన్​సిటీ, రాజేంద్రనగర్, ఎయిర్​పోర్టు వైపు వెళ్లే వెహికల్స్ గురు రాఘవేంద్ర హోటల్, టీఎస్​పీఏ నార్సింగి రోటరీ, గచ్చిబౌలి మీదుగా  లంగర్ హౌజ్​ వైపు నుంచి వెళ్లాలి. గచ్చిబౌలి, శంకర్​పల్లి నుంచి రాజేంద్రనగర్, బండ్లగూడ, కాళీమందిర్, మొయినాబాద్, చేవెళ్ల వైపు వచ్చే వెహికల్స్ నార్సింగి రోటరీ –1, తారామతి బారాదారి, టిప్పుఖాన్​ బ్రిడ్జి మీదుగా వెళ్లాలి. టిప్పుఖాన్​ బ్రిడ్జి నుంచి మొయినాబాద్, చేవెళ్ల వైపు వచ్చే వెహికల్స్ హిమాయత్​సాగర్​ గ్రామం, టీఎస్​పీఏ రోటరీ–2 మీదుగా వెళ్లాలి. శంషాబాద్ ఓఆర్​ఆర్ ​నుంచి కాళీమందిర్, బండ్లగూడ జాగీర్, సన్​సిటీ, మొయినాబాద్, చేవెళ్ల వైపు వచ్చే  వెహికల్స్ ఎగ్జిట్–​17, ఎగ్జిట్– 1 నుంచి  లేదా గచ్చిబౌలి ​ఎగ్జిట్–​ 19 నుంచి వెళ్లాలి. గచ్చిబౌలి ఓఆర్​ఆర్​ నుంచి కాళీమందిర్​, బండ్లగూడ జాగీర్, సన్​సిటీ, హైదరాబాద్​ వైపు వెళ్లే వెహికల్స్​రాజేంద్రనగర్ ఓఆర్​ఆర్ టోల్​గేట్​నుంచి బుద్వేల్ గ్రామం, కిస్మత్ పురా, కాళీమందిర్​ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మొయినాబాద్ నుంచి హిమాయత్ సాగర్, టిప్పుఖాన్ బ్రిడ్జి మీదుగా టీఎస్పీఏ రోడ్, నార్సింగి నుంచి టీఎస్పీఏ సర్వీస్ రోడ్, ఓఆర్ఆర్ ఎగ్జిట్–18 అన్నీ టోల్స్ ​రద్దీగా ఉంటాయి.

భారీ వెహికల్స్ కు నో ఎంట్రీ

మాదాపూర్​, నార్సింగి ట్రాఫిక్ ​పీఎస్ పరిధిలో పోలీసులు సూచించిన రూట్లలో భారీ వెహికల్స్​కు అనుమతి లేదు. రాజేంద్రనగర్​ నుంచి కాళీమందిర్, టిప్పుఖాన్​ బ్రిడ్జి నుంచి మొయినాబాద్, శంషాబాద్​ ఓఆర్ఆర్ నుంచి కాళీమందిర్, గచ్చిబౌలి ఓఆర్​ఆర్​ నుంచి టీఎస్​పీఏ(రాష్ట్ర పోలీస్ అకాడమీ),  గచ్చిబౌలి సర్వీస్ రోడ్ నుంచి టీఎస్​పీఏ, చేవెళ్ల, మొయినాబాద్ నుంచి టీఎస్​పీఏ, కేపీహెచ్​బీ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్​, గచ్చిబౌలి, ఖాజాగూడ వైపు అనుమతించరు.