ఎయిర్ పోర్ట్​ మెట్రో కారిడార్​తో రవాణా వ్యవస్థ మరింత బలోపేతం : కేటీఆర్

ఎయిర్ పోర్ట్​ మెట్రో కారిడార్​తో రవాణా వ్యవస్థ మరింత బలోపేతం : కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ఎయిర్ పోర్ట్​ మెట్రో కారిడా ర్​తో హైదరాబాద్​లో ప్రజా రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని మంత్రి కేటీఆర్​ అన్నా రు. ఇంతటి కీలకమైన కార్యక్రమ శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశ ప్రాంగణం వంటి ఏర్పాట్లను ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ రెం డో దశ విస్తరణకు డిసెంబర్ 9న కేసీఆర్​ శంకుస్థాపన చేయనున్నారు. ఈ  నేపథ్యంలో కేటీఆర్​ బుధ వారం రివ్యూ చేశారు. మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీజీపీ, మెట్రో రైల్, పురపాలక, ఎయిర్ పోర్ట్ అధికారులు హాజరయ్యారు.

శంషాబాద్ నుంచి మొదలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాదిమందికి ఈ మెట్రో రైల్ విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందని కేటీఆర్ అన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో గురువారం పర్యటించి, పరిశీలించాలని సూ చించారు. ట్రాఫిక్, రక్షణ ఏర్పాట్లు, ప్రణాళికల పై ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించారు. అందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమ నిర్వహణలో భాగస్వాములు కావాలని  సూచించారు.