ఎన్నికల తర్వాత కేసీఆర్ అన్నీ బంద్ పెడతారు

ఎన్నికల తర్వాత కేసీఆర్ అన్నీ బంద్ పెడతారు

తాను రాజీనామా చేయడం కారణంగా ప్రజలకు పెన్షన్లు, రేషన్ కార్డులు, గొల్ల, కురుమలకు గొర్లు, దళిత బంధు వస్తోందన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ . కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాక గ్రామంలో పర్యటించిన ఆయన.. మంత్రులు, ఎమ్మెల్యేలను గంజిల ఈగ లెక్క తీసేసిన వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో దళిత బిడ్డలకు పెడుతున్న అన్నంకు కూడ కేసీఆర్ డబ్బులు ఇవ్వలేదున్నారు. అందుకే అర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారన్నారు. దళిత బంధు అన్నడు, తర్వాత బీసీల బంధు అంటడు, ఎన్నికలు అయిన తర్వాత అన్ని బంద్ పెడతడని విమర్శించారు ఈటల.

 తమ నియోజక వర్గాల్లో పనులు చేయడానికి చేతకాని ఎమ్మెల్యేలు ఇక్కడకు వచ్చి అన్ని ఇస్తామంటున్నారని ఆరోపించారు ఈటల. హుజురాబాద్ లో దెబ్బ కొడితే కేసీఆర్ కు దిమ్మ తిరగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇన్ని ఏళ్ళు అధికారంలో ఉండి ఎవరితో గొడువపడలేదని..ఏ పార్టీ జెండా కూడ పీకించలేదని తెలిపారు. అయితే తాను ఏ ఊరికి వెళ్తే ఆ ఊరులో కరెంట్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. నేను చిన్న వాడిని అయితే ఎందుకు భయ పడుతున్నరో చెప్పాలన్నారు.ఆర్థిక, ఆరోగ్య మంత్రిగా పని చేసిన సమయంలో అసెంబ్లీలో అందరు శభాష్ అన్నారని చెప్పారు. నేను ఏ పదవిలో ఉన్న దానికి న్యాయం చేశానని చెప్పారు ఈటల.