ప్రకృతి పట్ల ఆరాధనే బతుకమ్మ: సిఎం కెసిఆర్

ప్రకృతి పట్ల  ఆరాధనే బతుకమ్మ: సిఎం కెసిఆర్
  • ప్రకృతి పట్ల  ఆరాధనే బతుకమ్మ
  • ప్రజలకు సీఎం కేసీఆర్ గ్రీటింగ్స్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పూల పండుగ బతుకమ్మ ముగింపు రోజు “సద్దుల బతుకమ్మ”ను పురస్కరించుకొని సీఎం కేసీఆర్​ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానంలోంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగని చెప్పారు. దేవుళ్లను పూజించే పువ్వులే బతుకమ్మగా పూజలందుకోవడం తెలంగాణ ప్రజలకు ప్రకృతి పట్ల ఉన్న ఆరాధనను, కృతజ్ఞతాభావనను తెలియజేస్తుందని వెల్లడించారు.