హైదరాబాద్, వెలుగు: ఇన్ఫ్రా సొల్యూషన్స్అందించే హైదరాబాద్‌కు చెందిన బొండాడ ఇంజినీరింగ్ లిమిటెడ్ మహారాష్ట్రలోని 270 మెగావాట్ల సోలార్ పీవీ ప్రాజెక్ట్ ఏర్పాటు కోసం రూ.1,153.93 కోట్ల విలువైన ఈపీసీ ఆర్డర్‌ను దక్కించుకుంది. సోలార్ ఈపీసీ, పునరుత్పాదక ఇంధనం, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (బీఈఎస్‌ఎస్) రంగాలపై దృష్టి సారించిన బొండాడ కంపెనీకి ఈ ప్రాజెక్ట్ మైలురాయిగా నిలవనుందని సంస్థ చైర్మన్ బొండాడ రాఘవేంద్రరావు అన్నారు.
