రూ.13 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జియో ఐపీఓ 

రూ.13 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో జియో ఐపీఓ 

ముంబై: రిలయన్స్‎కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫామ్స్ ఈ నెలలోనే దేశంలోనే అతిపెద్ద ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) తెచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రమోటర్లు తమ వాటాలను అమ్మడం లేదు కాబట్టి, ఈ ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ ఉండదు. 

ఈ ఐపీఓ ద్వారా రూ.12 లక్షల కోట్ల నుంచి రూ.13 లక్షల కోట్ల వ్యాల్యుయేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మార్కెట్ క్యాపిటలైజేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టాప్– 3 కంపెనీలలో ఒకటిగా జియో లిస్టయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రిలయన్స్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెల్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. సెబీ ఆగస్టు 28న ఈ ప్రతిపాదనకు తుది అనుమతులు జారీ చేసింది.

 డ్రాఫ్ట్ రెగ్యులేటరీ పత్రాల ప్రకారం, కంపెనీ 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అక్టోబర్ 19న యాంకర్ రౌండ్ జరగనుండగా, అక్టోబర్ 21 నుంచి 23 వరకు సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ నిర్వహించనున్నారు. కంపెనీ ఉద్యోగులకు ప్రత్యేక కోటా కేటాయించారు. ఈ ఆఫర్ ద్వారా జియో దాదాపు రూ.36,594 కోట్లు సమీకరిస్తుంది.