
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ పర్యటన రద్దయింది. గురువారం సాయంత్రం మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉన్న కెసిఆర్, జగన్ లు కొన్ని కారణాల వల్ల తమ పర్యటనను రద్దు చేసుకున్నారు.
కేంద్ర మంత్రి మండలి ప్రమాణస్వీకారాల నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా ఆకాశ మార్గ రాకపోకలపై పౌర విమానాల శాఖ (DGCA )అధికారులు ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 3 :30 తరువాత షెడ్యూల్ లో లేని ప్రత్యేక విమానాలు ఢిల్లీలో దిగేందుకు అనుమతులు రద్దు చేశారు.
3:30 గంటల లోపు వచ్చే విమానాలకు మాత్రమే అనుమతులిచ్చింది పౌరవిమానయాన శాఖ. ఈ క్రమంలో మోడి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుగానే షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నా…. జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమం ఆలస్యం కావడంతో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల పర్యటన రద్దైంది.