తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ చిత్రం ‘కీడా కోలా’. రానా సమర్పణలో కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మించారు.
ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘‘పెళ్లి చూపులు’ చిత్రంతో నన్ను హీరోగా లాంచ్ చేసిన తరుణ్ తర్వాత.. ‘ఈ నగరానికి ఏమైంది’ చేసి ఇంకొంతమందికి కెరీర్ ఇచ్చాడు. ఇప్పుడు ‘కీడా కోలా’లో కూడా మంచి టాలెంటెడ్ యాక్టర్స్ కనిపిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగా మజా ఇస్తుందనే నమ్మకముంది. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసేలా ఉంటుంది.
తరుణ్‌తో త్వరలోనే ఓ సినిమా చేస్తా’ అని చెప్పాడు. తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ ‘క్రైమ్ కామెడీ నా ఫేవరేట్ జానర్. ఎన్ని సమస్యలున్నా నవ్వు తెప్పించాలనే ప్రయత్నమే ఈ సినిమా. అన్ని రకాల హాస్యం ఇందులో ఉంది’ అని చెప్పాడు. ఇందులో నటించిన చైతన్యరావు, బ్రహ్మానందం, రాజా గౌతమ్ ఇదొక ఫన్ రైడ్‌లా ఉంటుందన్నారు. అవుట్‌పుట్ బాగా
వచ్చిందని, ప్రేక్షకులంతా ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందని నిర్మాతలు తెలిపారు.
