6 లక్షల టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచండి

6 లక్షల టన్నుల ఎరువులను సిద్ధంగా ఉంచండి
  • మార్క్‌‌ఫెడ్‌‌ కు అగ్రికల్చర్​ సెక్రటరీ ఆదేశం.. ఎరువులపై యాక్షన్​ప్లాన్​ గైడ్​లైన్స్ రిలీజ్

హైదరాబాద్, వెలుగు : 6 లక్షల టన్నుల ఎరువుల బఫర్‌‌ స్టాక్‌‌ సిద్ధంగా ఉంచుకోవాలని మార్క్‌‌ఫెడ్‌‌ ను అగ్రికల్చర్​సెక్రటరీ టి.రఘునందన్‌‌రావు ఆదేశించారు. 2024-=25 రెండు సీజన్​లకు సంబంధించి ఎరువుల సరఫరా, పంపిణీ, పర్యవేక్షణ సజావుగా జరిగేలా మంగళవారం యాక్షన్​ప్లాన్​గైడ్​లైన్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా రఘునందన్‌‌రావు మాట్లాడుతూ..బఫర్​ స్టాక్​లో యూరియానే 5 లక్షల టన్నులు సిద్దం చేసుకోవాలన్నారు. 

సీజన్ అవసరాలలో 30 శాతం జిల్లా మార్క్‌‌ఫెడ్ గోదాముల్లో బఫర్‌‌ నిల్వలు ఉంచాలని తెలిపారు. ప్రతీ జిల్లాలో 5 వేల టన్నుల యూరియాను మార్క్‌‌ఫెడ్‌‌ బఫర్‌‌ స్టాక్‌‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఎరువులను మాన్యువల్‌‌గా అమ్మడానికి ఏ డీలర్‌‌కూ అనుమతి లేదని చెప్పారు. ఇ=పాస్‌‌ మిషన్‌‌ ద్వారా మాత్రమే అమ్మాలని ఆదేశించారు. ఎరువుల పరిస్థితిని సమీక్షించడానికి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ నెలవారీ సమావేశాలు నిర్వహించాలన్నారు. 

పీక్‌‌ సీజన్‌‌లో ప్రతీ డీలర్‌‌కు నిర్ధిష్టంగా కేటాయించిన యూరియాను రోజుకు 2 ట్రక్కులకు మాత్రమే పరిమితం చేయాలన్నారు. పంట ప్రాంతం, భూసారకార్డుల సిఫార్సుల ఆధారంగా ఎరువుల కేటాయింపులుండాలని చెప్పారు. ప్యాక్స్‌‌, డీసీఎంఎస్‌‌, ఏఆర్‌‌కేఎస్‌‌లు, మ్యాక్స్‌‌ సంస్థలను రిటైలర్లుగా పరిగణిమని తెలిపారు. ఈ సంస్థలు ఎరువులను రైతులకు మాత్రమే విక్రయించాలి కానీ మరో డీలర్‌‌కు అమ్మకూడదని స్పష్టం చేశారు. 

యూరియా రేక్‌‌లో కనీసం 60 శాతం మార్క్‌‌ఫెడ్‌‌కు కేటాయించేలా డీఏవో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. జిల్లాల వారీగా యూరియా కేటాయింపు తర్వాత డీఏవోలు స్టాక్‌‌ను మండలాల వారీగా, ఏజెన్సీల వారీగా కలెక్టర్ ఆమోదాన్ని పొందాల్సి ఉంటుందని గైడ్​ లైన్స్​లో అగ్రికల్చర్​ సెక్రటరీ పేర్కొన్నారు.