ఏంటి కీర్తి మళ్లీనా?.. కాస్త చూస్కోవచ్చుగా

ఏంటి  కీర్తి మళ్లీనా?.. కాస్త చూస్కోవచ్చుగా

వరుస ఫ్లాపుల నుంచి తేరుకుంటున్న కీర్తి సురేశ్(Keerthi Suresh)​కు ‘దసరా(dasara)’ కాస్త ఊరటనిచ్చింది. ఎలాగైనా ఈ సక్సెస్​ను నిలబెట్టుకుంటుంది అనుకున్న టైంలో ఓ వార్త ఫ్యాన్స్​ను కంగారు పెడుతోంది. తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్​ కథకు కీర్తి గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే గుడ్ లక్ సఖి(Good luck sakhi), మిస్ ఇండియా(Miss india), పెంగ్విన్(Pengvin) వంటి ఫ్లాపులు ఆమె ఖాతాలో ఉన్నాయి. దీందో లేడీ ఓరియెంటెడ్​ సినిమాలు ఈ హీరోయిన్​కి కలిసిరావడం లేదని అంతా ఫిక్స్​ అయ్యారు. 

తాజాగా ఈ డెసిషన్​తో కీర్తి మళ్లీ అదే తప్పును రిపీట్​ చేసేలా కనపడుతోంది. కానీ, ఈ సినిమాను దిల్​రాజు(Dil raju) నిర్మిస్తుండటంతోనే ఈ బ్యూటీ డేర్​ చేస్తుందనే టాక్​ కూడా ఉంది. గతంలో వీరి కాంబినేషన్​లో ‘నేను లోకల్(Nenu Local)’​ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సెంటిమెంట్​తో మరోసారి మహానటి(Mahanati) తరహాలో  ప్రూవ్​  చేసుకోవాలనుకుంటుందట. కొత్త దర్శకుడు తీస్తున్న ఈ మూవీలో యంగ్​ నటుడు సుహాస్(Suhas)​ కీ రోల్​ చేస్తున్నాడు.