ఇటు మాస్.. అటు యాక్షన్

ఇటు మాస్.. అటు యాక్షన్

హీరోయిన్ కీర్తి సురేష్ ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే, మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ మెప్పిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తున్న కీర్తి ఖాతాలో మరో మూవీ చేరింది. తమిళ దర్శకుడు చంద్రు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు ‘రివాల్వర్ రీటా’ అనే టైటిల్‌‌ను ఫైనల్ చేశారు. ఇదో కామెడీ యాక్షన్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌. సంక్రాంతి సందర్భంగా టైటిల్‌‌తో పాటు ఫస్ట్ లుక్‌‌ పోస్టర్‌‌‌‌ను సమంత లాంచ్ చేసి బెస్ట్ విషెస్ తెలియజేసింది. ఈ పోస్టర్‌‌‌‌లో రెండు చేతుల్లో రెండు రివాల్వర్స్‌‌ పట్టుకున్న కీర్తి లుక్ ఆకట్టుకుంది.

ఇందులో ఆమె యాక్షన్ రోల్ చేస్తున్నట్టు అర్థమవుతోంది. ది రూట్‌‌, ప్యాషన్‌‌ స్టూడియోస్‌‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది కీర్తి. అందులో నానితో కలిసి నటిస్తున్న ‘దసరా’ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయింది. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో మాస్‌‌ గెటప్‌‌లో కనిపిస్తోంది. మార్చి 20న ఇది రిలీజ్ కానుంది. ఇక ‘భోళా శంకర్’ చిత్రంలో చిరంజీవికి చెల్లెలిగా నటిస్తుంది. మరోవైపు ‘కేజీఎఫ్‌‌’ నిర్మాతలు తీస్తోన్న ‘రఘు తథా’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీతో పాటు మరో రెండు తమిళ చిత్రాల్లోనూ నటిస్తోంది. ఇలా ఒకే సమయంలో రకరకాల పాత్రలు చేస్తూ డిఫరెంట్ వేరియేషన్స్‌‌ చూపిస్తోంది కీర్తి సురేష్.