కావాలని తాకి, తలపై కొట్టాడు.. అందుకే చెంప పగలగొట్టాను: కీర్తి సురేష్

కావాలని తాకి, తలపై కొట్టాడు.. అందుకే చెంప పగలగొట్టాను: కీర్తి సురేష్

సినీ సెలబ్రెటీస్ అంటే జనాల్లో క్రేజ్ ఉంటుంది. వాళ్ళని చూడాలని, ఫోటో దిగాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలని ట్రై చేస్తూ ఉంటారు. అందుకే స్టార్స్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లిపోతుంటారు. అయితే అందులో కొంతమంది ఆకతాయిలు లైన్ క్రాస్ చేసి బిహేవ్ చేస్తూ ఉంటారు. స్టార్స్ తో మిస్ బిహేవ్ చేస్తూ శాడిస్ట్ లుగా ప్రవరిస్తూ ఉంటారు. అలాంటి వారిని కొంతమంది పెద్దగా పట్టిచ్చుకోరు, కొంతమంది మాత్రం అందరిముందే బుడ్డి చెప్పి పోలీసులకి పట్టిస్తారు. 

సరిగ్గా అలాంటి పనే చేసిందట మహానటి కీర్తి సురేష్(Kaarthy Suresh). సినిమాల్లో చాలా సాఫ్ట్ గా కనిపించే ఈ బ్యూటీ.. బయట మాత్రం కాస్త రెబల్ గానే ఉంటుందట. తనతో మిస్ బిహేవ్ చేసిన వ్యక్తిని పట్టుకొని అందరిముందు చెప్పా చెల్లుమనిపించి పోలీసులకు పట్టించిందట. ఇటీవల ఆన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కీర్తి తన రియల్ లైఫ్ సంఘటన చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. నేను సినిమాలోకి రాక ముందు.. నీ ఫ్రెండ్స్ తో వెళ్తుంటే ఒక తాగుబోతు నాతో మిస్ బిహేవ్ చేశాడు. కావాలని తాకి నా తలపై కొట్టాడు. వెంటనే వాడిని పట్టుకొని అందరిముందే చెంప పగలగొట్టి పోలీసులకి అప్పగించాను అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కీర్తి సురేష్ చేసిన ఈ కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ కీర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరు మీలా ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక కీర్తి సురేష్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాలున్నాయి. అందులో తెలుగులో రెండు జెల్లసీత సినిమా చేస్తున్నారు కీర్తి. ఈ సినిమాను రామ్ ప్రసాద్ రగుతూ తెరకెక్కిస్తున్నారు. తమిళంలో సైరన్, రివాల్వర్ రీటా, కన్నివేది సినిమాలు చేస్తోంది. ఇక బాలీవుడ్ లో బేబీ జాన్ సినిమాలోల్ వరుణ్ ధావన్ కు జోడీగా నటిస్తోంది కీర్తి. ఈ సినిమా ఇటీవలే లాంఛనంగా మొదలైంది. మరి ఈ సినిమాలు కీర్తికి ఎలాంటి రిజల్ట్ ను ఇస్తాయో చూడాలి.