
ఓ వైపు గ్లామరస్ రోల్స్ చేస్తూనే, మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ మెప్పిస్తోంది కీర్తి సురేష్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న కీర్తి ఖాతాలో మరో మూవీ చేరింది. ప్రముఖ రైటర్ సుమన్ కుమార్ దర్శకత్వంలో తన నెక్స్ట్ ప్రాజెక్టు ఉండనుంది. ఈ తమిళ సినిమాకు ‘రఘు తథా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘కేజీఎఫ్’ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిలింస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఫిమేల్ ఓరియెంటెడ్ బ్యాక్‌డ్రాప్‌లో దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు చెప్పారు మేకర్స్. ఇదిలా ఉంటే కీర్తి ప్రస్తుతం మరో నాలుగు సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో చిరంజీవికి చెల్లెలిగా ‘భోళా శంకర్’, నానికి జంటగా ‘దసరా’ చిత్రంలో నటిస్తోంది. మరోవైపు నిర్మాతగానూ తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటోదట కీర్తి. ఆమె ఫ్రెండ్స్‌తో కలిసి ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేయబోతోందని తెలుస్తోంది. కీర్తి తండ్రి సురేష్ కుమార్ మలయాళంలో పలు సినిమాలను నిర్మించడంతో.. నిర్మాణం ఆమెకి కొత్తేమీ కాదంటున్నారు ఆమె ఫ్యాన్స్.