మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి

V6 Velugu Posted on May 08, 2021

వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటే ఢిల్లీలో మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామన్నారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో  18 ఏళ్లు పైబడిన వారు కోటిన్నర మంది ఉన్నారని చెప్పారు. వీరందరికి మూడు కోట్ల డోసులు అవసరమవుతాయన్నారు కేజ్రీవాల్. ఇప్పటివరకూ ఢిల్లీకి 40 లక్షల డోసులు మాత్రమే అందాయన్నారు. మరో 2 కోట్ల 60 లక్షల డోసులు ఢిల్లీకి అవసరమవుతాయన్నారు.  ప్రతి నెలా ఢిల్లీకి 80 నుంచి 85 లక్షల వ్యాక్సిన్ డోసులు వస్తే మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తవుతుందన్నారు. ఇలా చేసేందుకు రోజుకూ మూడు లక్షల వ్యాక్సిన్ డోసులు కావాలన్నారు. ప్రస్తుతం రోజుకూ లక్ష మందికి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు చెప్పారు. 

Tagged Delhi, Vaccination, Kejriwal, Delhi CM, 3 Months

Latest Videos

Subscribe Now

More News