ఢిల్లీ లో బస్, మెట్రో రైళ్లలో మహిళలకు ఫ్రీ

ఢిల్లీ లో బస్, మెట్రో రైళ్లలో మహిళలకు ఫ్రీ

రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఆమ్‌ ఆద్మీపార్టీ ప్రభుత్వం ఆఫర్లు ప్రకటిస్తోంది. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునేందుకు మెట్రో, బస్‌ ప్రయాణాలు మహిళలకు ఉచితంగా కల్పించాలని, ప్రజా రవాణాను వినియోగించుకునే విధంగా వారిని ప్రోత్సహించేందుకు ఈ చర్యలుచేపట్టినట్లు ప్రకటించింది. ఇప్పటికే విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు కృషి చేస్తామన్న కేజ్రీవాల్…తాజాగా DTC బస్సులు, ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయించారు. రెండు నెలల తర్వాత ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఢిల్లీమెట్రో లో ప్రయాణించే 7 లక్షల మంది మహిళలకు, బస్సులో ప్రయాణించే 8 లక్షల మంది  మహిళలకు లాభం చేకూరనుంది. ఈ ఉచిత ప్రయాణంతో ఢిల్లీ మెట్రో కి, బస్సుకి నెలకి 50 కోట్లు రూపాయలు..ఏడాదికి 12 వందల కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వచ్చే అవకాశముంది.