లాక్‌డౌన్‌ ఉంచాలా.. ఎత్తేయాలా సూచనలు ఇవ్వండి

లాక్‌డౌన్‌ ఉంచాలా.. ఎత్తేయాలా సూచనలు ఇవ్వండి
  • ప్రజలను కోరిన ఢిల్లీ సీఎం

న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ను కొనసాగించాలా, లేదా తీసేయాలా అనే అంశంపై సూచనలు చేయాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రజలను కోరారు. ఈ మేరకు సూచనలను 1031 నంబర్‌‌కు కాల్‌ చేసి చెప్పాలన్నారు. 8800007722కి వాట్సాప్‌ ద్వారా మెసేజ్‌ చేయాలని లేదా delhicm.suggestions@gmail.comకు మెయిల్‌ చేయాలని చెప్పారు. బుధవారం సాయంత్ర ఐదు గంటల వరకు ప్రజల నుంచి సూచనలు తీసుకుంటామన్నారు. మంగళవారం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు రూ.5వేలు ఆర్థిక సాయం చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు. లాక్‌డౌన్‌ ముగించే సమయం వచ్చిందని వలస కార్మికులు ఎక్కడికి వెళ్లొద్దని ఇప్పటికే కేజ్రీవాల్‌ ప్రకటించారు. అయితే ఈ నెల 17 తర్వాత లాక్‌డౌన్‌ 4.0 ఉంటుందా లేదా అనే అంశంపై కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా.. ఈ రోజు రాత్రి 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు.