ODI World Cup 2023: మనుసు దోచేశాడు: షమీని మెచ్చుకున్న అమెరికన్ పోర్న్ స్టార్

ODI World Cup 2023: మనుసు దోచేశాడు: షమీని మెచ్చుకున్న అమెరికన్ పోర్న్ స్టార్

సొంతగడ్డపై భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీ‌ దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యా గాయ పడటంతో జట్టులోకి వచ్చిన షమీ.. అవకాశం వచ్చినప్పుడల్లా చెలరేగిపోతున్నాడు. బంతిని ఇరు వైపులా స్వింగ్ చేస్తూ వైవిధ్యమైన పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. ఆడింది రెండు మ్యాచ్‌లే అయినా.. ఏకంగా 9 వికెట్లు తీశాడు. అతని ఈ ప్రదర్శన భారత అభిమానులనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలో పోర్న్ స్టార్లను ఆకట్టుకుంటోంది.

ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో (5/54) వికెట్లతో చెలరేగిన షమీ.. లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 230 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోగలిగిందంటే.. షమీ పాత్ర కీలకం. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ ఇంగ్లిష్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ముఖ్యంగా ఆ జట్టు ప్రమాదకర ఆటగాడు బెన్ స్టోక్స్‌ను ఔట్ చేసిన తీరు మ్యాచ్‌కే హైలైట్‌. మొదట ఔట్ స్వింగర్స్‌తో ఇబ్బంది పెట్టిన షమీ.. అనూహ్యంగా బంతిని మరింత టర్న్‌ చేసి స్టోక్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 7 ఓవర్లు వేసిన షమీ  22 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. 

కేంద్రా లస్ట్.. హై-ఫై 

మ్యాచ్ ముగిసిన అనంతరం లక్ష్మి రతన్ శుక్లా(@Lshukla6) అనే యూజర్ షమీ ప్రదర్శనను మెచ్చుకుంటూ హీరో ఆఫ్ ది వీక్ అని ట్వీట్ చేసింది. అందుకు అమెరికన్ అడల్ట్ ఫిల్మ్ స్టార్ కేంద్రా లస్ట్ స్పందిస్తూ.. షమీ బౌలింగ్ గణాంకాలు తనకు ఎంతగానో నచ్చాయన్నట్లు 'హై-ఫై' అని కామెంట్ చేసింది. ఇది పొగడ్తే అయినా.. ఈ ట్వీట్ మాత్రం నెట్టింట నానా రచ్చ చేస్తోంది. అతని సతీమణి హసీన్ జహాన్ పెట్టిన టార్చర్ చాలు మీరు కాస్త దూరంగా ఉండండి అంటూ నెటిజెన్స్.. లస్ట్ కామెంట్‌కు బదులిస్తున్నారు.

కాగా, హసీన్ జహాన్.. షమీపై తప్పుడు కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. షమీ ఒక ఫిక్సర్, స్త్రీలోలుడు అంటూ బహిరంగంగా సంచలన ఆరోపణలు చేసి అతని కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాలు చేసింది. కానీ, షమీ వాటిన్నింటికీ బంతితోనే సంధానమిస్తున్నాడు.