తొమ్మిదేళ్ల పాపపై కుక్కల దాడి.. వీటిని ఏం చేయాలంటారు...

తొమ్మిదేళ్ల పాపపై కుక్కల దాడి.. వీటిని ఏం చేయాలంటారు...

కేరళలోని కన్నూర్‌లోని ముజప్పిలంగాడ్‌లో వీధికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా జాన్వీ అనే తొమ్మిదేళ్ల బాలికపై కుక్కలు విచ్చలవిడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఇటీవలే ఈ ప్రాంతంలో ఒక యువకుడి మరణానికి దారితీసిన ఈ కుక్కల దాడి.. ఆ తర్వాతి రోజే ఈ సంఘటన జరగడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది.

జాన్వీపై దాడి, గాయాలు

జాన్వీ తన ఇంటి పెరట్లో ఆడుకుంటున్న సమయంలో మూడు వీధి కుక్కలు ఆమెపై దాడి చేశాయి. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో కుక్కలు ఆమెను నేలపైకి ఈడ్చుకెళ్లి, జుట్టును లాగి, కొరికి, తీసుకెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సహాయం కోసం ఆమె కేకలు వేయడంతో అప్పటికే ఆమె చేతులు, కాళ్లు, తలపై పలుమార్లు కొరికి తీవ్రంగా గాయపర్చాయి.

ఈ సమయంలో సహాయం కోసం జాన్వీ కేకలు వేయడంతో అక్కడున్న స్థానికులు వెంటనే స్పందించి అప్రమత్తం అయ్యారు. దీంతో కుక్కలు అక్కడ్నుంచి పారిపోయాయి. కుక్కల దాడిలో ఆమె తల, పొత్తికడుపు, తొడలు, చేతిపై లోతైన గాయాలు ఉన్నాయని స్థానిక నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

https://twitter.com/Ramith18/status/1670838554849865728