
కేరళలో ఓ పెళ్లి కూతురు డోలు కొట్టి దుమ్మారు రేపింది. సంప్రదాయ వాయిద్యం చెండా వాయిస్తూ అందరినీ ఆకట్టుకుంది. మ్యూజిక్ ట్రూప్ సభ్యులతో కలిసి డ్రమ్స్ వాయిస్తూ అందరిలో జోష్ నింపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
త్రిస్సూర్ జిల్లా గురువాయూర్ ఆలయంలో సోమవారం ఓ పెండ్లి జరిగింది. పెళ్లి కూతురు శిల్ప తండ్రి పొన్నన్స్ బ్లూ పేరుతో ఓ మ్యూజిక్ ట్రూప్ నడుపుతున్నాడు. కూతురు పెళ్లిలో ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో తండ్రి డ్రమ్స్ వాయిస్తుండగా పెళ్లి కూతురు వేదిక దిగి వచ్చింది. తోటి కళాకారులతో కలిసి ఉత్సాహంగా చండా వాయించింది. ఆమె జోష్ చూసి పెళ్లి కొడుకు చిడతలు వాయిస్తూ వారితో జత కలిశాడు. మెకానికల్ ఇంజనీర్ అయిన శిల్ప కుటుంబం తండ్రి వద్ద ఆమె 12ఏండ్ల పాటు చెండా నేర్చుకుంది. తండ్రీకూతుళ్లు కలిసి అక్కడ ప్రోగ్రాంలు కూడా ఇచ్చారు.