బంపర్ లాటరీ

బంపర్ లాటరీ

గతేడాది తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘బంపర్’ చిత్రం తెలుగులో రాబోతోంది. కేరళ లాటరీ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందించిన ఈ సినిమాలో వెట్రి, శివాని నారాయణన్  లీడ్ రోల్స్‌‌‌‌లో నటించగా, హరీష్ పేరడి, జి. పి. ముత్తు, తంగదురై, కవితా భారతి ఇతర పాత్రలు పోషించారు. ఎం సెల్వకుమార్ దర్శకత్వంలో ఎస్ త్యాగరాజా, టి ఆనందజ్యోతి ఈ చిత్రాన్ని నిర్మించారు. 

శనివారం తెలుగు ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను హైదరాబాద్‌‌‌‌లో రిలీజ్ చేశారు. స్నేహితులతో కలిసి అయ్యప్పమాల వేసుకుని కేరళ వెళ్ళిన ఓ యువకుడికి అక్కడ కొన్న లాటరీ టిక్కెట్‌‌‌‌కు ప్రైజ్ మనీ వస్తుంది. దాన్ని కలెక్ట్ చేసుకునేందుకు అతను పడ్డ కష్టాలు, స్నేహితులతో ఇబ్బందులను ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనింగ్‌‌‌‌గా చూపిస్తూ..  

థ్రిల్లర్ ఎలిమెంట్స్‌‌‌‌తో  సాగిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.  ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో  తెలుగులో విడుదల చేయనున్నామని చెప్పింది  టీమ్. తమిళంలో సక్సెస్ సాధించిన ఈ సినిమా తెలుగులో కూడా ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉందని నటీనటులు అన్నారు.