- రూ.16 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న అదానీ పోర్ట్స్
న్యూఢిల్లీ: కేరళలోని విజింజం అంతర్జాతీయ పోర్టు రెండో దశ అభివృద్ధి పనులను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ప్రారంభించారు. ఈ దశలో అదానీ పోర్ట్స్ రూ.16 వేల కోట్లను ఇన్వెస్ట్ చేయనుంది. 2029 నాటికి పోర్టు సామర్థ్యాన్ని 57 లక్షల టీఈయూకి పెంచాలని టార్గెట్ పెట్టుకుంది.
మొత్తం రూ.30 వేల కోట్ల పెట్టుబడితో ప్రపంచంలో అతిపెద్ద ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్టుగా విజింజం మారుతుందని, కేవలం 15 నెలల్లోనే దీని సామర్ధ్యం10 లక్షల టీఈయూకి చేరిందని అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీ తెలిపారు.
